తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే సిరీస్​లో ధావన్ స్థానంలో మయాంక్

వెస్టిండీస్​తో​ వన్డే సిరీస్​ కోసం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్​కు అవకాశం కల్పించారు సెలక్టర్లు. ధావన్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది.

Agarwal replaces injured Dhawan in India's ODI squad
మయాంక్ - శిఖర్​ ధావన్

By

Published : Dec 11, 2019, 3:07 PM IST

గాయంతో వెస్టిండీస్​తో పరిమిత ఓవర్ల సిరీస్​కు టీమిండియా ఓపెనర్​ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీ20 సిరీస్​కు సంజూ శాంసన్​ను తీసుకోగా.. వన్డే సిరీస్​కు మాత్రం మయాంక్ అగర్వాల్​కు అవకాశం కల్పించారు సెలక్టర్లు.

"శిఖర్ ధావన్​ గాయం నుంచి నిదానంగా కోలుకుంటున్నాడు. పూర్తిగా నయం కావడానికి ఇంకా సమయం పడుతుందని మా వైద్యబృందం తెలిపింది. విండీస్​తో వన్డే సిరీస్​ కోసం అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్​ను తీసుకోవాలని సెలక్టర్లు సూచించారు." -బీసీసీఐ ప్రకటన

వెస్టిండీస్​తో​ మూడు వన్డేల సిరీస్​ ఆడనుంది టీమిండియా. తొలి వన్డే చెన్నై వేదికగా డిసెంబరు 15న ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ విశాఖలో డిసెంబరు 18న జరగనుంది. మూడో వన్డే కటక్ వేదికగా డిసెంబరు 22న నిర్వహించనున్నారు. బుధవారం విండీస్​తో నిర్ణయాత్మక చివరి టీ20 జరగనుంది.

ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​తో సిరీస్​ల్లో మయాంక్ అద్భుతంగా ఆడాడు. ఈ కారణంగా అతడిని వన్డే సిరీస్​లో తీసుకున్నారు. విజయ్​శంకర్​కు గాయంతో ప్రపంచకప్​లోనే 15 మంది సభ్యుల్లో మయాంక్​ను తీసుకోగా.. మ్యాచ్ ఆడే అవకాశం అతడికి రాలేదు. 28ఏళ్ల ఈ బెంగళూరు ఆటగాడు 9 టెస్టుల్లో 872 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.

వెస్టిండీస్​తో వన్డే సిరీస్​కు భారత జట్టు..

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్(కీపర్), శివమ్ దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.

ఇదీ చదవండి: రనౌట్ వదిలేసిన బౌలర్​పై ప్రశంసలు- ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details