తెలంగాణ

telangana

ETV Bharat / sports

జమ్ముకశ్మీర్​ యువ క్రికెటర్లకు కోచ్​గా రైనా! - raina jk

జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్ సిన్హాతో మాజీ క్రికెటర్ రైనా భేటీ అయ్యాడు. రాష్ట్రంలోని క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చే విషయమై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.

raina
జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​తో రైనా భేటి

By

Published : Sep 18, 2020, 8:32 PM IST

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా.. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, పోలీసు డైరెక్టర్​ దిల్బాల్​ సింగ్​లతో శుక్రవారం సమావేశమయ్యాడు. లోయలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రైనా వారికి ఇటీవలే లేఖ రాశాడు. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వీలు కల్పించినట్లవుతుందని పేర్కొన్నాడు. ఈ విషయంపై చర్చించేందుకు వారితో భేటీ అయ్యాడు.

"జమ్ముకశ్మీర్​లో క్రీడలను ప్రోత్సహించే దిశగా కృషి చేయడంపై లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హాతో సమావేశం జరిగింది. అందుకు ఆయన మద్దతు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి"

సురేశ్​ రైనా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ఈ సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు జమ్ముకశ్మీర్​ పోలీసులు, రైనాకు మెమొంటో అందజేశారు. వన్డే​ల్లో 5,615 పరుగులు చేసిన ఇతడు.. టెస్టుల్లో 768 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్​లో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా రైనా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి తిరిగొచ్చేశాడు.

లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హాతో రైనా

ABOUT THE AUTHOR

...view details