ఓవైపు ఐపీఎల్ జరుగుతుండగా మరోవైపు బీసీసీఐ, ఆస్ట్రేలియా పర్యటన ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. భారత జట్టు నవంబరు 12న ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది. బోర్డు ప్రస్తుతం యూఏఈలో లేని ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఈ నెలాఖరుకు దుబాయ్ పిలిపించనుంది. పుజారా, హనుమ విహారి, కోచ్ రవిశాస్త్రి, ఐపీఎల్‌లో భాగం కాని సహాయ సిబ్బందిలోని ఇతర సభ్యుల కోసం ప్రత్యేక బయో బబుల్‌ను సృష్టించనుంది.
ఐపీఎల్ తర్వాత భారత క్రికెటర్లు అట్నుంచి అటే - ipl indian cricketers
టీ20 లీగ్ పూర్తయిన తర్వాత అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు భారత క్రికెటర్లు. ప్రస్తుతం లీగ్‌లో భాగం కానివారు త్వరలో దుబాయ్ చేరుకోనున్నారు.
![ఐపీఎల్ తర్వాత భారత క్రికెటర్లు అట్నుంచి అటే after IPL indian cricket team players for australia tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9051532-275-9051532-1601860543335.jpg)
ఐపీఎల్ తర్వాత భారత క్రికెటర్లు అట్నుంచి అటే
ఆస్ట్రేలియాలో భారత జట్టు క్వారంటైన్ కాలం ఎక్కువ ఉండకుండా చూడాలన్నది బీసీసీఐ ఉద్దేశం. అయితే ఆ దేశంలో భారత జట్టు స్థావరం ఎక్కడ అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
Last Updated : Oct 5, 2020, 8:32 AM IST