తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ తర్వాతే భారత టీ20 ప్రపంచ కప్​​ జట్టుపై నిర్ణయం ' - టీ20 వరల్డ్​ కప్​ స్క్వాడ్​

ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్ అనంతరం టీ20 వరల్డ్​ కప్​ జట్టుపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపాడు టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్​ రాఠోడ్​. ప్రపంచ కప్​కు ముందు జరుగుతున్న ఈ సిరీస్​ మంచి ప్రాక్టీస్​గా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.

After England series, we should know our team for T20 WC, says Vikram Rathour
'ఆ తర్వాతనే భారత టీ20 ప్రపంచ కప్​​ జట్టుపై అంచనా'

By

Published : Mar 10, 2021, 11:14 AM IST

Updated : Mar 10, 2021, 11:58 AM IST

భారత్​ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా బ్యాటింగ్​ కోచ్ విక్రమ్​ రాఠోడ్​. ఇంగ్లాండ్​తో సిరీస్​ అనంతరం తమ టీ20 స్క్వాడ్​పై ఓ అంచనాకు వస్తామని వెల్లడించాడు.

''టీ20 వరల్డ్​కప్​ భారత్​లో జరుగనుంది. అయితే బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంగ్లాండ్​తో జరగబోయే సిరీస్​లో ఆడే ఆటగాళ్లే దాదాపు ప్రపంచ కప్​లోనూ ఉంటారని అనుకుంటున్నాం. ఈ సిరీస్​ తర్వాత ఆ విషయంపై స్పష్టత వస్తుంది. ఎవరైనా ఫామ్ కోల్పోయినా, గాయాల పాలైనా తిరిగి గాడిన పడటానికి ఇదే అనువైన సమయం. ప్రపంచ కప్​నకు ముందు జరిగే ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్​గా ఉపయోగపడుతుంది.''

-విక్రమ్​ రాఠోడ్, టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్.

ఇంగ్లాండ్ తరహాలోనే భారత్​ కూడా దూకుడుగా ఆడనుందా? అనే ప్రశ్నపై స్పందించాడు రాఠోడ్​. "గేమ్​ను గెలవడమనేది అవసరం. పరిస్థితుల బట్టి స్ట్రైక్​రేట్ ఆధారపడుతుంది. మొదట బ్యాటింగ్​ చేసేటప్పుడు స్కోర్ ఎక్కువ చేసే అవకాశముంటుంది. లక్ష్య ఛేదనలో అది భిన్నంగా ఉండొచ్చు.. 10 ఓవర్లలోనూ ఆటను ముగించొచ్చు. లేదా 20 ఓవర్లు పట్టొచ్చు. మొత్తానికి ఆటను గెలవాలనే దృక్పథం అవసరం." అని విక్రమ్​ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్​తో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది. అన్ని టీ20లు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్నాయి. నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను భారత్ ఇప్పటికే​ 3-1తో గెలుపొందింది.

ఇదీ చదవండి:టైటిల్​ వేటలో సీఎస్​కే- చెమటోడుస్తున్న ఆటగాళ్లు

Last Updated : Mar 10, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details