తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 సిరీస్​లలో రెండేళ్లుగా ఓటమెరుగని అఫ్గాన్​ - afghan series won

వెస్టిండీస్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో గెలిచి 2-1 తేడాతో టీ20 సిరీస్​ను కైవసం చేసుకున్న అఫ్గానిస్థాన్.. పొట్ట్టి ఫార్మాట్​లో రెండేళ్లుగా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

అఫ్గాన్​.. పసికూన కాదు.. 'పస' ఉన్న కూన

By

Published : Nov 18, 2019, 9:51 AM IST

అఫ్గానిస్థాన్.. పసికూన జట్టు.. ఏముంది వారిపై సులభంగా గెలిచేయొచ్చు.. పెద్ద విషయేమేం కాదు.. సగటు క్రికెట్ వీక్షకుడి అభిప్రాయాలివి.. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది.. పొట్టి ఫార్మాట్​లో అదరగొడుతోంది అఫ్గాన్. ఎంతలా అంటే ఆ జట్టు టీ20 సిరీస్ ఓడిపోయి రెండేళ్లవుతుంది. అఫ్గానిస్థాన్ చివరగా 2017జూన్​లో టీ20 సిరీస్​ ఓడింది.

2018 జనవరి​ నుంచి టీ20ల్లో అఫ్గానిస్థాన్ విజయాలు

జనవరి 2018 నుంచి టీ20ల్లో అఫ్గాన్ ప్రదర్శన..

  • జింబాబ్వేపై 2-0తేడాతో విజయం..
  • బంగ్లాదేశ్​పై 3-0
  • ఐర్లాండ్​పై 2-0
  • ఐర్లాండ్​పై 3-0
  • బంగ్లాదేశ్​పై 2-2 తేడాతో సిరీస్ డ్రా

తాజాగా వెస్టిండీస్‌తో మూడు టీ20 మ్యాచ్​ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుందిఅఫ్గానిస్థాన్‌. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 29 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (79; 52 బంతుల్లో) రాణించాడు.

విండీస్ బౌలర్లలో కాట్రెల్‌, క్రిక్‌ విలియమ్స్‌, కీమో పాల్‌ తలో రెండు వికెట్లు తీశారు. నవీన్‌ ఉల్‌ హక్‌ (3/24) విజృంభించడంతో విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులే చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఏకైక టెస్టు లఖ్‌నవూ వేదికగా ఈనెల 27న ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: ధోనీ వల్ల జీవితాంతం వేధన మిగిలింది: గంభీర్​

ABOUT THE AUTHOR

...view details