తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేనూ షమిలా బౌలింగ్ చేయగలను'

భారత్​తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ బౌలర్ అబు జాయేద్ సత్తాచాటాడు. ప్రస్తుతం కోల్​కతా వేదికగా జరిగే రెండో టెస్టు కోసం ప్రాక్టీస్​ చేస్తున్నాడు. ఈ సమయంలో టీమిండియా పేసర్ షమి దగ్గర సూచనలు తీసుకున్నాడు.

By

Published : Nov 18, 2019, 9:40 PM IST

జాయేద్

టీమిండియా పేసర్ మహ్మద్ షమిలా తానూ బౌలింగ్ చేయగలనని అంటున్నాడు బంగ్లాదేశ్ బౌలర్ అబు జాయేద్. డే/నైట్‌ టెస్టు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇండోర్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా జాయేద్.. షమి దగ్గర సూచనలు తీసుకున్నాడు.

'నేన, షమి భాయ్‌తో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరం సీమ్‌ను ఉపయోగిస్తాం. షమి బౌలింగ్ చేయడాన్ని చాలా సార్లు చూశా. దానిపై ప్రత్యేక దృష్టిపెట్టా. షమి.. నాకన్నా ఎత్తుగా ఉన్నాడా లేదా సమాన ఎత్తులో ఉన్నాడా అని తెలుసుకోవడానికి అతడి ఎత్తును నాతో పోల్చుకున్నా. అప్పుడు నేనూ.. అతడిలాగే బౌలింగ్ చేయొచ్చని గుర్తించాను"
-అబు జాయేద్, బంగ్లా పేసర్

తొలి టెస్టు మ్యాచ్​లో విరాట్ కోహ్లీని ఔట్ చేయడం వల్ల, తన కల నిజమైందని అన్నాడు జాయేద్. గులాబి బంతితో ఆడే​ టెస్టు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అబూ జాయేద్ సత్తాచాటాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోతే, అన్నీ ఇతడికే దక్కడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజారా, అంజిక్య రహానే వంటి టాప్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడీ బౌలర్.

ఇవీ చూడండి.. 'సవ్యసాచి' బౌలింగ్​కు నెటిజన్ల ఫిదా!

ABOUT THE AUTHOR

...view details