ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. అపజయాలు లేకుండా దూసుకుపోతోంది. బ్యాటింగ్‌లో అందరూ తమ పరిధి మేరకు రాణిస్తున్నారు. బౌలర్లు షమి, చాహల్, కుల్దీప్, బుమ్రా ఆకట్టుకుంటున్నారు. కానీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. బ్యాటుతో మెరుస్తున్నా బౌలింగ్‌లో అంతంత మాత్రంగానే వికెట్లు తీస్తున్నాడు. ఈ విషయంపై స్పందించిన పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, పాండ్యను తన దగ్గరికి పంపిస్తే ప్రపంచ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానన్నాడు.
"పాండ్య బౌలింగ్‌లో లోపాలున్నాయి. అతడి ఫుట్‌వర్క్ కొంచెం వేరుగా ఉంది. వాటిని సరిచేస్తే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అవుతాడు. ఓ రెండు వారాల పాటు అతణ్ని నాకు వదిలేస్తే ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా." -అబ్దుల్ రజాక్, పాక్ మాజీ క్రికెటర్