రానున్న ప్రపంచకప్‌లో విజేతగా ఎవరు నిలుస్తారా అనేది క్రికెట్ లోకాన్ని తొలిచేస్తోన్న ప్రశ్న. మాజీ క్రీడాకారులు, విశ్లేషకులు వారి అభిమాన జట్లు గెలుస్తాయని జోస్యం చెబుతున్నారు. విధ్వంసక బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ మాత్రం భారత్ లేదా పాకిస్థాన్ కప్పు కొడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"భారత్ లేదా పాక్" - ind
ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్ లేదా పాకిస్థాన్‌కే ఉన్నాయని డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఏ.బి డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
"ప్రపంచకప్ విజేత ఎవరో చెప్పాలంటే కొంచెం కష్టమే. ఆసియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, పాకిస్థాన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ గెలిచింది ఇంగ్లండ్ లోనే. ఆతిథ్య ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్. దక్షిణాఫ్రికా తమ ప్రయత్నాల్లో ఉంది. ఇవన్నీ ప్రపంచకప్‌లో నా అభిమాన జట్లు" - ఏ.బి డివిలియర్స్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు
గతేడాది అనూహ్యంగా తన రిటర్మైంట్ ప్రకటించాడు ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్. ప్రస్తుతం ఐపీఎల్, పీఎస్ఎల్ లాంటి టీ20 లీగ్స్‌లో ఆడుతున్నాడు.