ఐపీఎల్ 13వ సీజన్ కోసం తమ ఆటగాళ్లతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ను నిర్వహించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆర్సీబీ ఆటగాళ్లను కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ చాహల్ నాయకత్వంలో రెండు జట్లుగా విభజించారు. చాహల్ తరఫున డివిలియర్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
కోహ్లీ-చాహల్ జట్లు
బ్యాట్స్‌మెన్ కాంబినేషన్లతో పాటు స్పిన్నర్లను సమంగా వేరుచేస్తూ ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసన్.. రెండు జట్లుగా విభజించారు. చాహల్ జట్టులో డివిలియర్స్‌తో పాటు దేవదత్ పడిక్కల్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ ఉన్నారు. కాగా కోహ్లీ జట్టులో ఇసురు ఉదానా, క్రిస్ మెరిస్, పార్థివ్ పటేల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
చాహల్ టీమ్ తరపున ఓపెనర్‌గా బరిలో దిగిన డివిలియర్స్ 33 బంతుల్లో 43 పరుగులు సాధించి కోహ్లీ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడితో పాటు పాటు దేవదత్ మంచి ప్రదర్శన చేశాడు. కోహ్లీ జట్టులోని బౌలర్ వాషింగ్టన్ సుందర్ కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
విదేశీ ఆటగాళ్లు లేని లోటు
ఛేదనలో కోహ్లీ, పార్థివ్ పటేల్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. చాహల్ జట్టులోని షాబాద్ అహ్మద్ 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ జట్టుకు చాహల్ టీమ్ గట్టి పోటీ ఇచ్చిందని ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ తెలిపాడు.
ఈ శిబిరంలో విదేశీ ఆటగాళ్లైన ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ, ఆడమ్ జంపా, జోష్ ఫిలిప్లు భాగం కాలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ పూర్తవ్వగానే వారంతా కలిసి లీగ్ కోసం యూఏఈ బయలుదేరుతారు.