క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 13వ సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో క్వారంటైన్ కోసం ముందుగానే ఈ మెగాలీగ్ వేదిక దుబాయ్‌కు అన్ని జట్లు చేరుకుంటున్నాయి. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు చెందిన ఆటగాళ్లు యూఏఈ చేరుకున్నారు. తాజాగా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, క్రిస్ మోరిస్ కూడా అక్కడికి చేరుకున్నారు. సహచర ఆటగాళ్లతో మాటా మంతీ కలిపారు.
డివిలియర్స్, స్టెయిన్ రాకతో ఆర్సీబీలో సందడి షురూ - Dale Steyn and Chris Morris join Royal Challengers Bangalore in Dubai
ఐపీఎల్ కోసం ఆర్సీబీ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, క్రిస్ మోరిస్ దుబాయ్ చేరుకున్నారు. దీంతో జట్టులో సందడి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్రాంచైజీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
డివిలియర్స్
దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వీళ్ల రాకతో జట్టులో సందడి వాతావరణం నెలకొంది. ఈ మెగాలీగ్ ప్రారంభమయ్యే వరకు వీరు క్వారంటైన్లో ఉంటారు.
ఇది చూడండి ఐపీఎల్ ముంగిట ఆటగాళ్ల క్వారంటైన్‌పై రచ్చ