ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్పై పెదవి విప్పాడు. 2023లో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని అన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్(భారత్), 2022 టీ20ప్రపంచకప్ (ఆస్ట్రేలియా), 2023 వన్డే ప్రపంచకప్‌కు (భారత్) ఆడతానని స్పష్టం చేశాడు.
సెప్టెంబరు 4 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు ఫించ్. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఐపీఎల్ 13వ సీజన్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఆడనున్నాడు. దుబాయ్ వేదికగా సెప్టెబరు 19 నుంచి బయోసెక్యూర్ వాతావరణంలో ఈ లీగ్ జరగనుంది.