లాక్‌డౌన్‌తో మ్యాచ్‌లు నిలిచిపోవడం వల్ల ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇతడిలానే టిక్‌టాక్ చేసిన సహచర క్రికెటర్ ఫించ్.. డ్యాన్స్ చేసేందుకు తెగ కష్టపడ్డాడు. ఒకానొక దశలో ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. దీనిని చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు.
టిక్‌టాక్ చేసేందుకు తెగ కష్టపడ్డ ఆసీస్ క్రికెటర్ - Aaron Finch Dancing Attempt news
వార్నర్‌లా టిక్‌టాక్ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు ఆసీస్ ఓపెనర్ ఫించ్. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోగా, దానిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఆసీస్ ఓపెనర్ ఫించ్
తన వయసు 30 దాటిపోవడం వల్ల డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పాడు ఫించ్. వార్నర్ మాత్రం పెద్దవాడైనా డ్యాన్స్ ఇరగదీస్తున్నాడని రాసుకొచ్చాడు. అతడిలా చేద్దామంటే కుదరడం లేదని అన్నాడు. అయితే డ్యాన్స్ కంటే క్రికెట్ బాగుందని తెలిపాడు.
ఆసీస్ తరఫున 126 వన్డేలాడిన ఫించ్.. 4882 పరుగులు చేశాడు. 61 టీ20ల్లో 1989 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.