ఐపీఎల్లో తన ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్టును ప్రకటించాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఒక్క ఆల్‌రౌండర్ కూడా లేకుండా ఐదుగురు బౌలర్లను ఎంపిక చేశాడు. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఈ లీగ్‌లో ఎక్కువ ట్రోఫీలు సాధించిన కెప్టెన్‌గా పేరొందిన రోహిత్ శర్మలను ఓపెనర్లుగా తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, నాలుగు స్థానాలకుగానూ సురేశ్ రైనా, విరాట్ కోహ్లీలను ఎంచుకున్నాడు.
మిడిలార్డర్లో ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీలను తీసుకున్నాడు ఆకాశ్. వీరిద్దరూ మైదానంలో కలిసి ఆడితే చూడాలని ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ధోనీని జట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా నియమించాడు. స్పిన్నర్ హర్భజన్ సింగ్, సునీల్ నరైన్‌లతో పాటు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగాలను పేసర్లుగా ఎంపిక చేశాడు. వీరితో పాటు మరో రెండు రిజర్వ్డ్ స్థానాలను ప్రకటించాడు. వారిలో గౌతమ్ గంభీర్, ఆండ్రూ రస్సెల్‌లు ఉన్నారు.