తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు: ఆకాశ్​ చోప్రా - kohli replacement kl rahul

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు(చివరి మూడు మ్యాచులు)​ దూరమవ్వబోతున్న టీమ్​ఇండియా సారథి కోహ్లీ స్థానంలో శుభమన్​ గిల్​ను తీసుకోవాలన్నాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. అలాగే టెస్టుల్లో ఓపెనింగ్​ జోడీలో మార్పులు జరగాలని సూచించాడు.

Virat Kohli
కోహ్లీ

By

Published : Dec 7, 2020, 9:31 AM IST

ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టులకు గైర్హాజరు కానున్న టీమ్​ఇండియా సారథి కోహ్లి(నెం.4) స్థానంలో శుభమన్​ గిల్​ను ఆడించాలని అభిప్రాయపడ్డాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. అలాగే టెస్టుల్లో మయాంక్​ అగర్వాల్​, పృథ్వీ షా ఓపెనింగ్​ భాగస్వామ్యాన్ని మార్చాలని సూచించాడు.

"తొలి టెస్టు తర్వాత కోహ్లీ స్థానంలో ఎవరిని నియమిస్తారు? తొలి టెస్టులో ఓపెనింగ్​ భాగస్వామ్యంపై అనిశ్చిచి నెలకొంది. ఈ స్థానంలో పృథ్వీ షా లేదా కేఎల్​ రాహుల్​కు అవకాశం రావచ్చు. అయితే ఓపెనర్​గా రాహుల్​ను పంపి.. మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​గా శుభమన్​ గిల్​కు అవకాశమివ్వడం మంచిదని నా అభిప్రాయం."

-ఆకాశ్​ చోప్రా, కామెంటేటర్​.

కాగా, ఓ మ్యాచ్​ మిగిలిఉండగానే టీమ్​ఇండియా టీ20 సిరీస్​ను దక్కించుకుంది. డిసెంబరు 8న ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో టీ20లో తలపడనుంది.

ఇదీ చూడండి: కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు: గావస్కర్​

ABOUT THE AUTHOR

...view details