తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీరిపై ఎక్కువ అంచనాలున్నాయి: ఆకాశ్ - ఆకాశ్ చోప్రా ధోనీ వ్యాఖ్యలు

ఈ ఏడాది ఐపీఎల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన ఆటగాడి ప్రదర్శనపై ఇప్పట్నుంచే లెక్కలేసుకుంటున్నారు. అయితే ఈసారి లీగ్​లో సత్తా చాటే భారత ఆటగాళ్లు వీరే అంటూ చెప్పుకొచ్చాడు వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. వారెవరో చూద్దాం.

వీరిపై ఎక్కువ అంచనాలున్నాయి: ఆకాశ్
వీరిపై ఎక్కువ అంచనాలున్నాయి: ఆకాశ్

By

Published : Sep 4, 2020, 8:46 PM IST

ఈ ఏడాది ఐపీఎల్‌లో టీమ్‌ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోతారని మాజీ టెస్టు ఓపెనర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు.. వరుసగా రిషబ్ పంత్, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లపై స్పందించాడు. ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నాడు.

రిషబ్ పంత్‌

ఈ ఏడాది పంత్‌కు కలిసొస్తుందని అనుకుంటున్నా. అతడికి ఈ ఐపీఎల్‌ ఎంతో ముఖ్యం. అతడు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని పలు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు చేయగలడు. అవి మర్చిపోలేనివిగా ఉంటాయి. ఈసారి దిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పైకి తీసుకొస్తుందని భావిస్తున్నా.

పంత్

రోహిత్‌శర్మ

ముంబయి ఇండియన్స్‌ సారథి కచ్చితంగా పరుగులు చేయగలడు. కానీ, టాపార్డర్​లో బ్యాటింగ్‌ చేస్తాడో లేదో అనే విషయాన్ని మాత్రం చెప్పలేను. ఈ సీజన్‌లో హిట్​మ్యాన్ 600-700 పరుగులు చేయాలని ఆశిస్తున్నా. అయితే, రోహిత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎప్పుడూ ఓ సమస్య ఉంటుంది. అతడు ఓపెనింగ్‌ చేస్తాడా లేదా అనేది తెలియదు. ముంబయి కెప్టెన్‌ ఒకవేళ ఓపెనింగ్‌ చేస్తే ఎక్కువ పరుగులు చేస్తాడు. లోయర్‌ ఆర్డర్‌లో వస్తే భారీ ఇన్నింగ్స్‌ ఆడలేడు.

రోహిత్

శ్రేయస్‌ అయ్యర్‌

శ్రేయస్‌కు ఈ ఐపీఎల్‌ సీజన్‌ అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా. అతడికి కలిసొచ్చే అంశాలు ఏవైనా ఉన్నాయంటే తన ఫిట్‌నెస్‌, పరుగులు చేయాలనే కసి. అలాగే లాక్‌డౌన్‌ కన్నా ముందు ఈ బ్యాట్స్‌మన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దిల్లీ అతడిని కెప్టెన్‌గా చేసినప్పటి నుంచి జట్టు కూడా మంచిగా రాణిస్తోంది. అలాగే స్పిన్‌ బౌలింగ్‌లో బాగా ఆడతాడు.

శ్రేయస్

మహేంద్రసింగ్‌ ధోనీ

ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ చెలరేగిపోతాడు. ఏడాది కాలంగా అతడు క్రికెట్‌ ఆడలేదు. అలాగే గత నెల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దాంతో చెన్నైని గెలిపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. సురేశ్‌ రైనా వైదొలగడం వల్ల ఆ భారం మహీపై పడుతుంది. ధోనీ వీలైతే నాలుగో స్థానంలో అయినా బ్యాటింగ్‌కు దిగుతాడు. ఒకవేళ అలానే జరిగితే ఈ సీజన్‌ మరింత బాగా సాగుతుంది.

ధోనీ

విరాట్‌ కోహ్లీ

కోహ్లీ లాంటి ఆటగాడిని పరుగులకు, క్రికెట్‌కు దూరంగా ఉంచలేం. అయితే, యూఏఈలో రాణించడం అంత తేలిక కాదు. అక్కడి పరిస్థితుల కారణంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకోసం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. కోహ్లీ ఈ విషయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. ఆర్సీబీ కెప్టెన్‌ టాపార్డర్​లో ఆడతాడు. కాబట్టి అధికంగా పరుగులు చేసే అవకాశం ఉంది.

కోహ్లీ

కేఎల్‌ రాహుల్‌

రాహుల్‌ ఇప్పుడున్న ఫామ్‌ను బట్టి మంచి స్థితిలో ఉన్నాడు. కెప్టెన్‌గా మారడం వల్ల అదనపు బాధ్యతలు పెరిగాయి. అతడి ఆలోచనా దృక్పథంతో ఈ సీజన్‌లో మరింత రెచ్చిపోగలడు. భారత బ్యాట్స్‌మెన్‌లో అతడే నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించే అవకాశం ఉంది. తద్వారా ఆరెంజ్‌ క్యాప్‌ కూడా సొంతం చేసుకోగలడని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

రాహుల్

ABOUT THE AUTHOR

...view details