దిగ్గజ సచిన్ తెందుల్కర్ పేరు మీద స్టేడియం కట్టించేందుకు భాజాపా ఎంపీ మనోజ్ తివారీ సిద్ధమవుతున్నారు. శనివారం తన సొంత ఊరిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఈయన.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
అసలు ఈ ఆలోచన ఎలా?
దిగ్గజ సచిన్ తెందుల్కర్ పేరు మీద స్టేడియం కట్టించేందుకు భాజాపా ఎంపీ మనోజ్ తివారీ సిద్ధమవుతున్నారు. శనివారం తన సొంత ఊరిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఈయన.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
అసలు ఈ ఆలోచన ఎలా?
2011లో టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ గెల్చుకుంది. అప్పట్లో భోజ్పురి నటుడిగా ఉన్న మనోజ్ తివారీ.. ఆ ఆనందంలో తన ఇంటికి దగ్గర్లో సచిన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఈయన.. తన గ్రామం అథర్వాలియాలో సచిన్ పేరు మీద ఏకంగా ఓ స్టేడియాన్నే నిర్మించనున్నానని చెప్పారు. ఈ విషయమై ఊరి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
"ప్రస్తుతం స్టేడియం నిర్మాణం కోసం భూమిని సేకరించే పనిలో ఉన్నాం. దీనికోసం 50 బిగాలు అవసరం, కానీ 30 బిగాలు లభ్యమయ్యాయి. మా ఊరిలో పొలాలంటే రైతులకు చాలా ఇష్టం. అలా అని మేం వారిని భూములు ఇవ్వమని ఇబ్బంది పెట్టం. అందుకు ప్రత్నామ్నాయాలు చూస్తున్నాం" -మనోజ్ తివారీ, దిల్లీ ఎంపీ
మరో ఏడాది తన కల నెరవేర్చి స్టేడియం నిర్మిస్తానని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. దీని వల్ల గ్రామ యువతకు ఆటల పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని చెప్పారు.