ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్ కోసం ప్రాక్టీసులో ఉన్న ఇతడు.. వర్చువల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని పెట్టిన కామెంట్‌కు అదే స్థాయిలో రిప్లై ఇచ్చాడు.
నెటిజన్ కామెంట్‌కు స్టోక్స్ అదిరే రిప్లై - ఐపీఎల్ లేటేస్ట్ న్యూస్
తనపై కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు అదే స్థాయిలో సమాధానమిచ్చాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. ఐపీఎల్ ప్రిపరేషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
గత సీజన్లో తన ముగింపు సరిగా లేదని అభిప్రాయపడ్డ స్టోక్స్.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు తనను ఉత్తేజపరుస్తున్నాయని అన్నాడు. అయితే స్టోక్స్.. ఇంగ్లాండ్ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని, వచ్చేసారి అతడి దేశం తరఫున బౌలింగ్ చేయమంటే అలసిపోతాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే తాను దేశ జట్టుకు బౌలింగ్ చేయడానికి ఎప్పుడు అలసిపోయానే చెప్పాలంటూ స్టోక్స్ బదులిచ్చాడు.
ఇటీవల ముగిసిన భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ కొంతమేర విఫలమైనప్పటికీ స్టోక్స్ తన వంతు పాత్ర పోషించాడు. నాలుగో టెస్టులో రెండో పేసర్‌గా నాలుగు వికెట్లు తీసి, రెండో వన్డేలో 99 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు.