టీమ్ఇండియా 2011 ప్రపంచకప్ గెలుపొంది పదేళ్లు అవుతున్న సందర్భంగా బీసీసీఐ గత స్మృతులను గుర్తు చేసుకుంది. ఒక దశాబ్దం తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయని తెలిపింది.
"2011లో ఇదే రోజు టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. రెండో సారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో మీకిష్టమైన క్షణం ఏది? అని పోస్టు చేసింది.
"మేము భారతదేశం కోసం, సచిన్ తెందుల్కర్ కోసం ప్రపంచకప్ గెలవాలనుకున్నాం. అంచనాలను అందుకున్నాం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం"
-యువరాజ్ సింగ్, మాజీ క్రికెటర్.
"ఏప్రిల్ 2, 2011 అనేది తన జీవితంలో, కెరీర్లో చాలా ముఖ్యమైన రోజు. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు. ఇది మొత్తం భారత్ గెలుపు" -హర్భజన్ సింగ్, టీమ్ఇండియా మాజీ స్పిన్నర్.