తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పంత్​ను తప్పించడం ఆశ్చర్యకరం'

ప్రపంచకప్​కు పయనమయ్యే టీమిండియా జట్టులో పంత్​కు చోటు దక్కలేదు. ఈ విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నారు.

'పంత్​ను తప్పించడం ఆశ్చర్యం కలిగించిందన్న సునీల్ గవాస్కర్

By

Published : Apr 15, 2019, 5:35 PM IST

నేడు ప్రపంచకప్​కు వెళ్లే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందులో పంత్​ను తప్పించడం తనను ఆశ్చర్యపరిచిందని మాజీ భారత కెప్టెన్ సునీల్ గావస్కర్ చెప్పారు. రోజు రోజుకు అతడు ఆటను మరింత మెరుగు పర్చుకుంటున్నాడని కితాబిచ్చారు.

33 ఏళ్ల దినేశ్ కార్తిక్.. ప్రపంచకప్​ భారత జట్టు రెండో వికెట్ కీపర్​గా ఎంపికయ్యాడు. మే 30 నుంచి ఇంగ్లండ్​లో ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది.

ఇది నాకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం పంత్ ఫామ్ చూడండి. ఐపీఎల్​లోనే కాకుండా అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకుంటున్నాడు. వికెట్ కీపింగ్​లోనూ రాణిస్తున్నాడు. -సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ కెప్టెన్

తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్​ను ప్రపంచకప్​ జట్టుకు ఎంపిక చేయడం సబబేనని గావస్కర్ అన్నారు.

విజయ్ శంకర్ గతేడాది నుంచి క్రికెటర్​గా ఆకట్టుకుంటున్నాడు. పూర్తి ఆత్వవిశ్వాసంతో ఆడుతున్న అతడు టీమిండియాకు అన్ని విభాగాల్లోనూ ఉపయోగపడతాడు. - సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ కెప్టెన్

ఇది చదవండి: ప్రపంచకప్​లో తలపడే బ్లూ టైగర్స్ వీరే..

ABOUT THE AUTHOR

...view details