తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈసారి ఐపీఎల్ వేలంలో 971 మంది క్రికెటర్లు

ఐపీఎల్-2020 వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 215 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు.. 754 మంది దేశవాళీ క్రికెటర్లు ఉన్నారు. ఈ నెల 19న కోల్​కతాలో వేలం జరగనుంది.

ఈ నెల 19న ఐపీఎల్ వేలం... 971 మంది ఆటగాళ్ల నమోదు
ఐపీఎల్

By

Published : Dec 2, 2019, 10:51 PM IST

Updated : Dec 2, 2019, 11:40 PM IST

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్​లో పలువురు కొత్త క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 19న కోల్​కతాలో వేలం జరగనుంది. ఇందులో 971 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. వీరిలో 713 మంది దేశీయ క్రికెటర్లు, 258 మంది విదేశీయులు.

971 మందిలో 215 మంది అంతర్జాతీయ అనుభవమున్నవారు.. 754 మంది దేశవాళీ క్రికెటర్లు. ఐసీసీ అసోసియేట్ దేశాలకు చెందినవారు ఇద్దరు.

అంతర్జాతీయ ఆటగాళ్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన వాళ్లు 19 మంది. 634 మంది భారత్​కు చెందిన ఫస్ట్​క్లాస్ క్రికెటర్లు. విదేశీయుల్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారు 196 మంది ఉండగా.. 60 మంది ఫస్ట్​క్లాస్ ఆటగాళ్లు.

ఐపీఎల్ కోసం ఆటగాళ్ల నమోదుకు నవంబరు 30తో గడువు ముగిసింది. క్రికెటర్ల లోటున్న ఫ్రాంఛైజీల రిజిస్ట్రేషన్​ కోసం ఈనెల 9 వరకు అవకాశముంది.

అఫ్గానిస్థాన్​(19), ఆస్ట్రేలియా(55), బంగ్లాదేశ్(6), ఇంగ్లాండ్(22), నెదర్లాండ్(1), న్యూజిలాండ్(24), దక్షిణాఫ్రికా(54), శ్రీలంక(39), యూఎస్​ఏ(1), వెస్టిండీస్(34), జింబాబ్వే(3) నుంచి పలువురు క్రికెటర్లు.. ఈసారి ఐపీఎల్​ వేలంలో కనిపించనున్నారు.

స్టార్క్ దూరం..

గత రెండు ఐపీఎల్ సీజన్లకూ దూరమైన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. వచ్చే ఏడాది జరగనున్న టోర్నీకీ అందుబాటులో ఉండట్లేదు. అయితే అతడి సహచరులైన గ్లెన్ మ్యాక్స్​వెల్, క్రిస్ లిన్​లతో మొత్తం ఏడుగురు ఆటగాళ్లు ఈ నెల 19న కోల్​కతాలో జరిగే వేలం జాబితాలో ఉండడం విశేషం.

2018 ఐపీఎల్ వేలంలో కోల్​కతా ఫ్రాంఛైజీ.. స్టార్క్​ను రూ.9.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఆ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఏడాది ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో... మెగాటోర్నీకే మొదటి ప్రాధాన్యమిస్తూ... ఈ సీజన్​లోనూ ఆడలేదు.

ఇదీ చదవండి: ప్రపంచకప్​లో తొలిసారి తలపడనున్న టీమిండియా

Last Updated : Dec 2, 2019, 11:40 PM IST

ABOUT THE AUTHOR

...view details