తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2019, 11:34 AM IST

ETV Bharat / sports

చెలరేగుతున్న కోహ్లీ.. 9 వన్డేల్లో 6 శతకాలు

వెస్టిండీస్​తో వన్డే అనగానే రెచ్చిపోయే విరాట్ కోహ్లీ.. మళ్లీ అలాంటి ఆటనే పునరావృతం చేయాలని అనుకుంటున్నాడు. కరీబియన్లతో ఆడిన చివరి 9 వన్డే ఇన్నింగ్స్​ల్లో ఆరు శతకాలు చేశాడు కోహ్లీ. ఆదివారం విండీస్​తో తొలి వన్డేలో తలపడనుంది భారత్.

9 innings, 6 hundreds: Virat Kohli looks to better his own records vs West Indies at Chepauk
టీమిండియా

వెస్టిండీస్​తో టీ20 సమరం ముగిసింది. 2-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది టీమిండియా. ఇప్పుడు వన్డే సిరీస్​లో సత్తా చాటాలనుకుంటోంది. ఆదివారం మొదటి మ్యాచ్​ జరగనుంది. ఈ సిరీస్​లో కొన్ని అరుదైన రికార్డులు నమోదు కానున్నాయి.

టైకు ముగింపు..

1979 నుంచి ఇప్పటివరకు కరీబియన్లతో టీమిండియా 130 వన్డేలాడింది. ఇరుజట్లు చెరో 62 విజయాలు అందుకున్నాయి. ఈ సిరీస్​తో టై కు ముగింపు పడనుంది. విండీస్​ చివరిగా భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​ను 2006లో నెగ్గింది. అప్పటినుంచి వరుసగా 9 సిరీస్​ల్లో విజయభేరి మోగించింది టీమిండియా.

విండీస్​పై విరాట్ రికార్డు బ్యాటింగ్..

వెస్టిండీస్​తో సిరీస్ అనగానే విరాట్ కోహ్లీ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. కరీబియన్లపై కోహ్లీ ఆడిన చివరి 9 వన్డేల్లో 174 సగటుతో 870 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, ఓ అర్ధశతకం ఉన్నాయి. వరుసగా 111*, 140, 157*, 107, 16, 33*, 72, 120, 114* గణాంకాలు నమోదు చేశాడు కోహ్లీ. మొత్తంగా విండీస్​తో 35 ఇన్నింగ్స్​లాడిన కోహ్లీ.. 2146 పరుగులు సాధించాడు. అందులో 9 శతకాలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ

చెన్నై వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు వెస్టిండీస్​తో తొలి వన్డే ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ విశాఖలో ఈనెల 18న జరగనుంది. మూడో వన్డే కటక్​లో ఈనెల 22న నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: నా రికార్డును వారిద్దరూ బ్రేక్​ చేస్తారు: లారా

ABOUT THE AUTHOR

...view details