అత్యుత్తమ బ్యాట్స్మెన్, సారథిగా దూసుకెళ్తోన్న విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. అతడిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు యువత గంటల తరబడి ఎదురుచూస్తారు. ఈ స్టార్ క్రికెటర్ భార్య అనుష్క శర్మ బాలీవుడ్లో ప్రముఖ నటి. అలాంటి ఈ ఇద్దరు స్టార్లు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఓ ఆటోగ్రాఫ్, ఓ సెల్ఫీ అడుగుతారు. కాని ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం వారికే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
ఇటీవల వెస్టిండీస్ టూర్లో భాగంగా కరీబియన్ దేశం అడుగుపెట్టిన కోహ్లీ.. ఖాళీ సమయంలో భార్యతో కలిసి వివిధ ప్రదేశాల్లో సందర్శించాడు. అలా ఓ చోట విరుష్క జోడీని గుర్తించిన బాలుడు... వారి దగ్గరికి వెళ్లి 'నా ఆటోగ్రాఫ్ కావాలా' అని అడిగాడు. ఆ బాబు మాటలకు అవాక్కైన అనుష్క, కోహ్లీ జోడీ.. నవ్వుతూ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ కుర్రాడి బంధువు అమిత్ లక్ష్మీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
" తొలి టెస్టు కోసం జమైకా వెళ్లిన నా ఏడేళ్ల మేనల్లుడు విరాట్ కోహ్లీని బయట కలుసుకున్నాడు. తన ఆటోగ్రాఫ్ కావాలా అని కోహ్లీ, అనుష్కను అడిగాడు. వెంటనే వారిద్దరూ ఆగిపోయి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు ".