భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమిపై ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ సిల్వర్‌వుడ్ స్పందించాడు. టీమ్ఇండియా స్పిన్నర్లు అశ్విన్ (32 వికెట్లు), అక్షర్ (27 వికెట్లు)ల కారణంగానే తాము ఓడిపోయినట్లు ఒప్పుకొన్నాడు. ఈ ఓటమి కొంతకాలం తమను బాధపెడుతుందన్నాడు.
తొలి టెస్టులో భారీ గెలుపుతో సిరీస్‌ను ప్రారంభించినప్పటికీ.. అశ్విన్, అక్షర్‌ల విజృంభణతో సిరీస్‌ను కోల్పోక తప్పలేదు. వికెట్లకు నేరుగా విసిరిన బంతులకు మా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. నాలుగు టెస్టుల్లో వారిద్దరే 59 వికెట్లు తీశారు. వారెంతలా చేలరేగిపోయారో.. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వారు మా బ్యాటింగ్‌ను క్లిష్టతరం చేశారు.