భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్, ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ల అంటే టక్కున గుర్తొచ్చేది టీ20 ప్రపంచకప్‌లోని ఆరు సిక్సులే. ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయేలా బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా, నాలుగో పేసర్‌గా నిలిచాడు. దీని గురించి ట్వీట్ చేసిన యువీ.. "అరుదైన ఘనత సాధించావు, నువ్వో దిగ్గజం" అని రాసుకొచ్చాడు.
"బ్రాడ్ లేదా నా గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లే గుర్తువస్తాయి. కానీ, ఈ రోజు అతను సాధించిన దానికి నా అభిమానులంతా మెచ్చుకోవాలి. టెస్టుల్లో 500 వికెట్లు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతో కృషి, అంకితభావం, సంకల్పం అవసరం. బ్రాడ్ నువ్వో దిగ్గజానివి! హ్యాట్సాఫ్"
-యువరాజ్ సింగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
నిర్ణయాత్మక మూడో టెస్టులో విండీస్ ఆటగాడు బ్రాత్‌వైట్‌ను ఔట్ చేసిన బ్రాడ్.. టెస్టుల్లో 500 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్.. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లిష్ జట్టు సాధించిన విజయాన్ని మెచ్చుకుని తీరాలని యువరాజ్, తన అభిమానులను కోరాడు.