టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక డకౌట్లు అయిన భారత కెప్టెన్‌గా ధోనీ సరసన చేరాడు విరాట్. సారథిగా మహీ 8 సార్లు డకౌట్ కాగా.. సరిగ్గా అన్నే డకౌట్లతో కోహ్లీ అతడి సరసన చేరాడు.
మరో చెత్త రికార్డుతో ధోనీ సరసన కోహ్లీ - dhoni
భారత కెప్టెన్ కోహ్లీ మరో రికార్డును నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు డకౌటైన టీమ్ఇండియా సారథిగా ధోనీ సరసన చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇరువురు చెరో 8 సార్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.
కోహ్లీ మరో చెత్త రికార్డు.. ధోనీ సరసన స్థానం
అంతే కాక, ఒకే సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ కావడం కోహ్లీకిది రెండోసారి. ఈ దఫా మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ అతని వికెట్ దక్కించుకున్నారు. స్టోక్స్ అత్యధికంగా 5 సార్లు విరాట్ వికెట్‌ను తీసుకున్నాడు. గతంలో 2014లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనే వరుసగా రెండు సార్లు సున్న పరుగులకే వెనుదిరిగాడు కోహ్లీ.