ఐపీఎల్లో మరో ఘనత సాధించిన గేల్ - ipl
విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గేల్ మరో ఘనత సాధించాడు. అతి తక్కువ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 4వేల పరుగులు పూర్తి చేసిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
గేల్
కరీబియన్ స్టార్ క్రికెటర్ గేల్ మరో ఘనత సాధించాడు. అతి తక్కువ ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే 4వేల పరుగులు పూర్తి చేసినరెండో విదేశీ ఆటగాడిగా నిలిచాడు. 112 మ్యాచ్‌ల్లో గేల్ ఈ ఘనత సాధించగా.. వార్నర్ (4,099) 114 మ్యాచ్‌లు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ 3,962 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Last Updated : Mar 25, 2019, 8:38 PM IST