తెలంగాణ

telangana

ETV Bharat / sports

4 వికెట్లు 402 పరుగులు.. పాక్​ బౌలర్​ చెత్త రికార్డు

ఆస్ట్రేలియా - పాకిస్థాన్​ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్​లో పాక్​ బౌలర్ యాసిర్​ షా చెత్త రికార్డు నెలకొల్పాడు. రెండు టెస్టుల్లో కలిపి 4 వికెట్ల తీసి 402 పరుగులు సమర్పించుకున్నాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు.. రెండో రోజు ఆటముగిసే సమయానికి 96/6 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది పాక్.

4 wickets for 400 runs: Yasir Shah's nightmares in Australia continue with pink ball as Warner rules with 335*
యాసిర్ షా చెత్త రికార్డు.. 4 వికెట్లు 402 పరుగులు

By

Published : Nov 30, 2019, 5:25 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్​లో పాకిస్థాన్ బౌలర్ యాసిర్ షా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ రెండు టెస్టుల్లో కలిపి కేవలం నాలుగు వికెట్లు తీసి 402 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఆసీస్​పై గత 5 టెస్టుల్లో అతడి బౌలింగ్ సగటు 89.5 ఉండడం గమనార్హం.

గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో 4 వికెట్లు తీసి 205 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం అడిలైడ్​లో జరుగుతున్న రెండో టెస్టులో 32 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్​ కూడా తీయకుండానే.. 197 పరుగులు ప్రత్యర్థి బ్యాట్స్​మన్​కు సమర్పించాడు. ఇందులో ఒకే ఒక్క ఓవర్ మేయిడెన్.

12 వికెట్లు 1074 పరుగులు..

ఆస్ట్రేలియాపై యాసిర్ షా బౌలర్ ప్రదర్శన అత్యంత ఘోరంగా ఉంది. ఆసిస్​ సొంతగడ్డపై అతడు ఆడిన ఐదు టెస్టుల్లో 12 వికెట్లు తీసి 1074 పరుగులు ఇచ్చాడు. 2016-17 సీజన్​లో ఒక్క ఇన్నింగ్స్​లోనే 207 పరుగులు సమర్పించి చెత్త రికార్డు నెలకొల్పాడు.

రెండో టెస్టులో ఈ లెగ్ స్పిన్నర్ బౌలింగ్​లోనే 111 పరుగులు పిండుకున్నాడు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ట్రిపుల్ సెంచరీతో కెరీర్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించాడు.

డేవిడ్ వార్నర్

కష్టాల్లో పాక్​..

ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 589/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా. వార్నర్(335*) ట్రిపుల్ శతకంతో చెలరేగగా.. లబుషేన్(162) శతకంతో అదరగొట్టాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ(3/88) మినహా.. మిగతా వారు విఫలమయ్యారు.

అనంతరం బరిలో దిగిన పాకిస్థాన్​ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 96 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. మిషెల్ స్టార్క్​(4/22) పాక్ బ్యాట్స్​మెన్ పతనాన్ని శాసించాడు. కమిన్స్, హేజిల్​వుడ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

ఆస్ట్రేలియా జట్టు

ఇదీ చదవండి: వార్నర్​ దూకుడు అడ్డుకున్న పైన్​.. నెటిజన్ల ఫైర్​

ABOUT THE AUTHOR

...view details