మార్చి 28న ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మూడో వన్డే వేదికను మార్చే అవకాశముంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్డేడియంలో జరగాల్సిన ఈ మ్యాచును ముంబయికి తరలించవచ్చు. ఈ విషయాన్ని సదరు క్రికెట్ స్డేడియం నిర్వాహకులు తెలిపారు. ఈ విషయమై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇంగ్లాండ్ X టీమ్ఇండియా: మూడో వన్డే వేదిక మార్పు! - భారత్ ఇంగ్లాండ్ మూడో వన్డే
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మూడో వన్డే వేదికను పుణె నుంచి ముంబయికి తరలించే అవకాశముందని తెలిపింది మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్. ప్రస్తుతం ఈ విషయమై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
![ఇంగ్లాండ్ X టీమ్ఇండియా: మూడో వన్డే వేదిక మార్పు! third odi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10682939-296-10682939-1613663283756.jpg)
మూడో వన్డే
ఈ మ్యాచ్‌తోనే ఇరు జట్లు మధ్య అన్ని ఫార్మాట్ల సిరీస్ పూర్తి కానుంది. ముంబయిలో మ్యాచ్ జరిగితే.. ఈ పోరు ముగిసిన అనంతరం ప్రత్యర్థి జట్టు నేరుగా తమ దేశానికి బయలుదేరే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు క్రికెట్ స్డేడియం అధికారులు తెలిపారు. కాగా, ఇరు జట్లు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడుతున్నాయి. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవ్వగా.. ఇరు జట్లు 1-1తో సిరీస్‌ను సమం చేశాయి.
ఇదీ చూడండి:ఐపీఎల్ వేలం: రికార్డు సృష్టించిన మోరిస్, మెరెడిత్, కృష్ణప్ప