యాషెస్ చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసే దిశగా ఇంగ్లాండ్ అడుగులు వేస్తోంది. ఇందుకు తగినట్లుగానే ఆస్ట్రేలియా ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 313/8 స్కోరు చేసిన ఇంగ్లీష్ జట్టు నాలుగో రోజు మరో 16 పరుగులు జోడించి 329 వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 69 పరుగుల ఆధిక్యంతో కలిపి 399 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఆసీస్ గెలుపు కోసం పోరాడక తప్పదు.
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో డెన్లీ(94) తృటిలో శతకం చేజార్చుకోగా.. బెన్ స్టోక్స్(67) అర్ధశతకంతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. పీటర్ సిడిల్, మిచెల్ మార్ష్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.