తెలంగాణ

telangana

ETV Bharat / sports

'300 వన్డేలు.. మా ఊహకు అందనిది' - SHREYAS IYER

విండీస్​ తరఫున 300 వన్డేలు ఆడాడు క్రిస్ గేల్. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లకు ఈ సంఖ్య.. కనీసం ఊహకైనా అందదని చెప్పాడు ఆ జట్టు కెప్టెన్ హోల్డర్.

క్రిస్ గేల్

By

Published : Aug 12, 2019, 6:30 AM IST

Updated : Sep 26, 2019, 5:29 PM IST

వెస్టిండీస్​ తరఫున అత్యధిక వన్డేలాడిన క్రికెటర్​గా నిలిచాడు విధ్వంసక బ్యాట్స్​మెన్​ క్రిస్​గేల్. ఇంతకు ముందు బ్రయాన్​ లారా(299 వన్డేలు) పేరిట ఈ రికార్టు ఉంది. టీమిండియాతో క్వీన్స్​పార్క్​లో జరిగిన రెండో వన్డే.. గేల్​కు 300వ 50 ఓవర్ల మ్యాచ్​. ఈ సందర్భంగా అతడిపై ప్రశంసలు కురిపించాడు విండీస్ కెప్టెన్ జేసన్ హాల్డర్.

300 వన్డేలాడిన తొలి వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్

"300 వన్డేలు.. క్రికెట్​లో చాలా పెద్ద అంకె. ప్రస్తుతం విండీస్​ జట్టులో ఉన్న క్రికెటర్లకు.. ఈ సంఖ్య ఊహకు అందనిది." -జేసన్ హోల్డర్, వెస్టిండీస్​ కెప్టెన్

విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్

భారత్​​తో జరిగిన తొలి వన్డేల్లో విఫలమయ్యాడు గేల్​. వర్షం కారణంగా రద్దయిన తొలి వన్డేలో 31 బంతులాడి కేవలం 4 పరుగులే చేశాడు. రెండో వన్డేలో 24 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరిగాడు.

39 ఏళ్ల గేల్​.. లారా నెలకొల్పిన మరో రికార్డును ఈ వన్డేతో అధిగమించాడు. వెస్టిండీస్​ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గేల్​(10,408) మొదటిస్థానంలో నిలిచాడు . లారా 10,405 పరుగులు చేశాడు.

Last Updated : Sep 26, 2019, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details