తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2019, 5:52 PM IST

ETV Bharat / sports

మన అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకుంటారా..!

మ్యాచ్ గెలిచి సిరీస్ పట్టేయాలని కివీస్ అమ్మాయిలు..విజయం సాధించాలని భారత మహిళా జట్టు. విజయం ఎవరికి దక్కేనో...

భారత్ న్యూజిలాండ్ మహిళల రెండో టీట్వంటీ

వన్డే సిరీస్ గెలిచి ఉత్సాహంతో టీట్వంటీలకు సిద్ధమైంది భారత మహిళా జట్టు. కానీ మొదటి మ్యాచ్​లోనే అంచనాలు తలకిందులై ఓటమి చవిచూసింది. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రేపు ఆక్లాండ్​లో జరగబోయే రెండో మ్యాచ్​కు సిద్ధమౌతోంది.

మొదటి మ్యాచ్​లో 160 పరుగుల ఛేదనలో 102 పరుగులకు ఒక వికెట్ నుంచి ఆలౌట్ అవడం టీం మేనేజ్​మెంట్​ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఓటమి.. 2017 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​ పరాజయాన్ని గుర్తుకుతెస్తోంది.

ఈ మ్యాచ్​లో మిథాలీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎంతో అనుభవమున్న ఆమెకు తుది జట్టులో చోటు లభించలేదు. 2020 టీట్వంటీ ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకొని ఆమెను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండో మ్యాచ్​లోనైనా ఆమెకు చోటు ఇస్తారా లేదా చూడాల్సిందే.

మంధానాపై అతిగా ఆధారపడటం మంచిది కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఓపెనర్​గా దీప్తి పునియా, నాలుగో స్థానంలో దయలన్ హేమలత ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు.

నేను 20వ ఓవర్​ వరకు ఆడేందుకు ఇష్టపడతా, అదే సరైన పద్ధతి. టాప్ ఆర్డర్ 18 ఓవర్ల వరకు ఆడితే మిగతా వారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది చేసేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తా --స్మృతి మంధానా

భారత సారధి హర్మన్ ప్రీత్ మ్యాచ్ గెలిచేందుకు ప్రణాళికలు వేయాల్సిందే. లేదంటే సిరీస్ కష్టమే.

చివరి వన్డే, మొదటి టీట్వంటీ గెలిచి న్యూజిలాండ్ మహిళల జట్టు ఊపు మీదుంది. రెండో మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్​ పట్టేయాలని చూస్తోంది.
మొదటి మ్యాచ్​లో న్యూజిలాండ్ పేసర్ లే తహుహు మూడు వికెట్లతో రాణించగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన సోఫి డివైన్ 62 పరుగులతో అజేయంగా నిలిచింది.

ఆక్లాండ్ వేదికగా శుక్రవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు

భారత్: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్),స్మతి మంధనా, మిథాలీ రాజ్, జెమియా రోడ్రిగ్విజ్, దీప్తి పునియా, తానియా భాటియా, పూనం యాదవ్, రాధ యాదవ్, అనుజా పాటిల్, ఏక్తా బిస్త్, దయాలన్ హేమలత, మన్షి జోషి, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, ప్రియా పునియా.

న్యూజిలాండ్: అమీ సెత్తర్త్​వైట్(కెప్టెన్), సూజీ బేట్స్, బెర్నడైన్ బెజుడెన్​హత్, సోఫి డివైన్, హేలీ జాన్సన్, కైట్లిన్ గుర్రే, లీ కాస్పిరిక్, అమీలా కెర్, ఫ్రాన్సిస్ మెక్ కే, కేటీ మార్టిన్, రోజ్​మేరి మైర్, హన్నా రో, లే తహుహు.

ABOUT THE AUTHOR

...view details