ఇంగ్లాండ్‌తో తొలిటెస్టులో టీమ్ఇండియా ఓటమి అనంతరం చెపాక్ పిచ్ క్యూరేటర్నుభారత క్రికెట్ నియంత్రణ మండలి తొలగించింది. చీఫ్ లోకల్ గ్రౌండ్స్‌మన్ వి.రమేశ్ కుమార్‌ను ఆ స్థానానికి ఎంపిక చేసింది. పిచ్ తయారీని టీమ్ఇండియా మేనేజ్మెంట్ పర్యవేక్షించనుంది. ఎర్రమట్టికి బదులుగా నల్లమట్టిని వాడి పిచ్ తయారు చేసేందుకే ప్రత్యేకంగా రమేశ్ కుమార్‌ను బీసీసీఐ ఎంపికచేసింది.
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు ప్రారంభానికి తక్కువ సమయం ఉన్నా.. బీసీసీఐకి చెందిన క్యూరేటర్ తపోశ్ ఛటర్జీని విజయ్ హజారే ట్రోఫీ కోసం పిచ్‌ను సిద్ధం చేసేందుకు బోర్డు బదిలీ చేసింది.