తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ విషయంలో ధోనీ తర్వాత రాహులే - KL Rahul Rare record

వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్​కు దిగి, 150కి పైగా స్ట్రైక్​రేట్​తో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత క్రికెటర్లలో ధోనీ తర్వాత కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు.

KL RAHUL
కేఎల్ రాహుల్

By

Published : Jan 17, 2020, 6:20 PM IST

కేఎల్​ రాహుల్ భీకర ఫామ్​తో దూసుకెళ్తున్నాడు.. టాపార్డర్​లో విధ్వంసం సృష్టిస్తున్న రాహుల్.. లోయర్​ ఆర్డర్​లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఆసీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో 80 పరుగులు చేసి అరుదైన ఘనత సాధించాడు. 5వ స్థానంలో బ్యాటింగ్​కు దిగి అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాట్స్​మెన్​లో మహీ తర్వాతి స్థానంలో నిలిచాడు.

2013 నుంచి ఇప్పటివరకు లోయర్​ ఆర్డర్​లో దిగి 150పైగా స్ట్రైక్​ రేట్​తో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఆరేళ్ల కిందట ఆస్ట్రేలియాపై ధోనీ 38 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్​లో రాహుల్ 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: ధావన్, కోహ్లీ, రాహుల్ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 341

ABOUT THE AUTHOR

...view details