తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధావన్, కోహ్లీ, రాహుల్ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 341

ఆసీస్​తో రెండో వన్డేలో భారత్.. 340/6 భారీ స్కోరు సాధించింది. ధావన్(96), కేఎల్ రాహుల్(80), కోహ్లీ(78) అదరగొట్టారు.

2nd ODI: Australia Target Is
భారత్ - ఆస్ట్రేలియా

By

Published : Jan 17, 2020, 5:13 PM IST

Updated : Jan 17, 2020, 5:22 PM IST

రాజ్​కోట్​లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్.. 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(96), విరాట్ కోహ్లీ(78) అర్ధశతకాలతో చెలరేగగా.. చివర్లో రాహుల్ 80 పరుగులతో మెరిశాడు. ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా 3 వికెట్లు తీశాడు. కేన్ రిచర్డ్​సన్ 2 వికెట్లు పడగొట్టాడు.

శుభారంభం

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. శిఖర్ ధావన్ - రోహిత్ శర్మ.. తొలి వికెట్​కు 81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట ధావన్ బ్యాట్ ఝుళిపించగా.. అనంతరం రోహిత్ శర్మ(42) వేగంగా ఆడాడు. ధాటిగా బ్యాటింగ్ చేసే ప్రయత్నంలో జంపా బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

శిఖర్ ధావన్

ధావన్ శతకం మిస్​

హిట్ మ్యాన్ ఔటైనా.. ధావన్ మాత్రం తగ్గలేదు. విరాట్ సాయంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ, రెండో వికెట్​కు 103 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గబ్బర్​.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. అగర్ బౌలింగ్​లో సిక్సర్​, ఫోర్​ కొట్టి 90ల్లో అడుగుపెట్టాడు. సెంచరీకి 4 పరుగులు ఉందనగా రిచర్డ్​సన్ బౌలింగ్​లో వెనుదిరిగాడు. ఇతడి ఇన్నింగ్స్​లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.

మెరుపులు మెరిపించిన రాహుల్

కేఎల్ రాహుల్

కాసేపటికే అయ్యర్ కూడా ఔట్​ కాగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు కోహ్లీ, రాహుల్. వేగంగా ఆడే ప్రయత్నంలో జంపా బౌలింగ్​లో బౌండరీ లైన్​లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు కోహ్లీ. చివర్లో కేఎల్ రాహుల్ వీరవిహారం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రాహుల్​కు జడేజా(19) తోడవడం వల్ల టీమిండియా భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆఫ్​సైడ్​ సిక్సర్లతో అదరగొట్టాడు. భీకర ఫామ్​లో ఉన్న రాహుల్​ 5వ స్థానంలో బ్యాటింగ్​కు వచ్చినప్పటికీ తనదైన శైలిలో విధ్వంసం సృష్టించాడు.

ఇదీ చదవండి: త్రుటిలో శతకం చేజార్చుకున్న శిఖర్​

Last Updated : Jan 17, 2020, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details