తెలంగాణ

telangana

ETV Bharat / sports

మోర్గాన్ సిక్సర్ల​ మోత.. ఇంగ్లాండ్​ భారీ లక్ష్య​ ఛేదన - south africa news

పొట్టి ఫార్మాట్​లో మరో ఉత్కంఠ పోరు. భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్​ అలవోకగా ఛేదించింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో ఇంగ్లీష్​ జట్టు​ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సఫారీ జట్టు 222 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేజ్​ చేసింది ఇంగ్లాండ్​. ఫలితంగా మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది మోర్గాన్​ సేన. ఈ మ్యాచ్​లో మొత్తం 28 సిక్సర్లు నమోదవడం విశేషం.

28 sixes: Morgan Innings blasts england a T20 series win with 2-1 agianst southafrica in centurion
మోర్గాన్ సిక్సర్ల​ మోత.. ఇంగ్లాండ్​ 223 రన్స్​ ఛేదన

By

Published : Feb 17, 2020, 8:12 AM IST

Updated : Mar 1, 2020, 2:18 PM IST

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్‌ టీ20 మ్యాచ్​ మరోసారి మజానిచ్చింది. తొలి రెండు మ్యాచ్​ల్లాగే ఇరుజట్లు పోటాపోటీగా తలపడ్డాయి. అయితే కీలక సమయంలో బ్యాట్​కు పనిచెప్పిన ఇంగ్లాండ్​ ఆటగాళ్లు... నిర్ణయాత్మక పోరును వన్​సైడ్​ చేశారు.

28 సిక్సర్ల మోత..

అప్పటికి ఇంగ్లాండ్​ గెలవాలంటే 24 బంతుల్లో 53 పరుగులు కావాలి. ఈ దశలో మోర్గాన్‌, స్టోక్స్‌ విరుచుకుపడ్డారు. కళ్లు చెదిరే షాట్లతో 17, 18, 19 ఓవర్లలో మొత్తం 52 పరుగులు రాబట్టారు. దూకుడుగా ఆడే క్రమంలో స్టోక్స్‌ అవుటైనా మోర్గాన్‌ వరుస సిక్సర్లతో.. సఫారీ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఫలితంగా ఈ పోరులో ఐదు వికెట్లతో సులువుగా గెలిచింది ఇంగ్లాండ్‌ జట్టు. అంతేకాకుండా మూడు మ్యాచ్​ల పొట్టి సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్లాసెన్‌ 66(33 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), బవుమా 49(24 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్‌ 35(24 బంతుల్లో; 1 ఫోర్‌, 4 సిక్సర్లు), మిల్లర్‌ 35*(20 బంతుల్లో; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో కరన్‌, స్టోక్స్‌ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (7) వికెట్‌ను ఇంగ్లండ్‌ త్వరగా కోల్పోయింది. కానీ బెయిర్‌ స్టో 64(34 బంతుల్లో; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ మోర్గాన్‌ 57*(22 బంతుల్లో; 7 సిక్సర్లు), బట్లర్‌ 57(29 బంతుల్లో; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. వారికి స్టోక్స్‌ 22(12 బంతుల్లో; 1ఫోర్‌, 2 సిక్సర్లు) ధాటి ఇన్నింగ్స్‌ తోడుకావడం వల్ల ఐదు బంతులు మిగిలి ఉండగానే.. 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది ఇంగ్లాండ్‌ జట్టు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు, ఫెలుక్వాయో, షంసీ, ప్రిటోరియస్​ తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

మోర్గాన్​కు.. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి. మొత్తం ఈ మ్యాచ్​లో 28 సిక్సర్లు నమోదయ్యాయి. అంతేకాకుండా ఛేజింగ్​లో ముగ్గురు ఆటగాళ్లు అర్ధశతకాలు చేయడం విశేషం.

Last Updated : Mar 1, 2020, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details