ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అంపైరింగ్ బాధ్యతలు చేపట్టిన దక్షిణాఫ్రికా తొలి మహిళగా చరిత్ర సృష్టించింది 23 ఏళ్ల క్రికెటర్ లారెన్ ఏజెన్‌బాగ్. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు జోహన్స్‌బర్గ్ వేదికగా సెంట్రల్ గౌటెంగ్ లయన్స్-బోలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు రోజులు మ్యాచ్‌లు జరిగాయి. వీటికి ఈమే మైదాన నిర్ణేతగా వ్యవహరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తొలిసారిటీ20లకు అంపైరింగ్ చేసి వార్తల్లో నిలిచింది.
23 ఏళ్ల లారెన్ ఏజెన్‌బాగ్ పురుషుల క్రికెట్‌కు...
సఫారీ జట్టు పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు అంపైర్‌గా లారెన్ ఏజెన్‌బాగ్‌కు బాధ్యతలు అప్పజెప్పింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఈ ఘనత సాధించిన తొలి మహిళా ప్రోటీస్ అంపైర్‌గా కొత్త అధ్యాయం లిఖించింది లారెన్. దక్షిణాఫ్రికాలో స్టాండర్డ్ మహిళా అంపైర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిసున్న ఈ మాజీ క్రీడాకారిణిపై... ఆ దేశ క్రికెట్ బోర్డు తాత్కాలిక డైరెక్టర్ కోరీ వాన్ జిల్ ప్రశంసలు కురిపించాడు.
"తన ప్రతిభను ప్రపంచానికి చూపించిన లారెన్ అంకితం భావంతో మరింత రాణించాలని కోరుకుంటున్నా. మిగతా మహిళా క్రికెటర్లకు ఆమె ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది".
--తాత్కాలిక డైరెక్టర్ కోరీ వాన్ జిల్, దక్షిణాఫ్రికా బోర్డు
ఐసీసీ మహిళా అంపైర్ల ప్యానల్‌లో సభ్యురాలిగా ఉన్న లారెన్... గత నెలలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఫైనల్ సహా పలు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు నిర్ణేతగా వ్యవహరించింది.