తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలాగైతే బీసీసీఐపై రూ.906 కోట్ల భారం! - 2021టీ20 ప్రపంచకప్​ ఐసీసీ

2021 టీ20 ప్రపంచకప్ నిర్వహణకు పన్ను మినహాయింపు కోరింది బీసీసీఐ. ప్రభుత్వం నుంచి అందుకు ఆమోదం లభించకపోతే బోర్డుపై పెద్దఎత్తున భారం పడనుంది.

2021 T20 World Cup: Hosts BCCI may end up paying Rs 906 crore tax
అలాగైతే బీసీసీఐపై రూ.906 కోట్ల భారం!

By

Published : Jan 4, 2021, 6:34 AM IST

ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుందా లేదా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ పూర్తి పన్ను మినహాయింపు లభించకపోతే ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీ‌ కోసం పన్ను రూపంలో బోర్డు రూ.906 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం పాక్షిక మినహాయింపు ఇచ్చినా కనీసం రూ.227 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

టోర్నీ నిర్వహణకు సిద్ధమో కాదో చెప్పడానికి బీసీసీఐకి ఐసీసీ ఇచ్చిన గడువు 2019 డిసెంబరు 31తోనే ముగిసింది. ఆ తర్వాత గడువును 2020 డిసెంబరు 31కి పొడిగించగా.. అప్పటికీ బీసీసీఐ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఐసీసీ ఇప్పుడు ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది.

2021 టీ20 ప్రంచచకప్​నకు పూర్తి పన్ను మినహాయింపు కోరుతూ బీసీసీఐ పెట్టుకున్న దరఖాస్తు ఆర్థిక మంత్రిత్వశాఖ వద్ద చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. 2016లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌నకు ప్రభుత్వం పది శాతం పన్ను మినహాయింపు మాత్రమే ఇచ్చింది. దీంతో టోర్నీ ఆదాయంలో బీసీసీఐకి రావాల్సిన వాటాలో ఐసీసీ రూ.173 కోట్ల 59 లక్షలను తగ్గించి ఇచ్చింది.

ఇదీ చూడండి:జట్టుతోనే సిడ్నీకి 'ఐసోలేషన్​ ఆటగాళ్లు'

ABOUT THE AUTHOR

...view details