తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంక ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్​ ఖరారు - లంక ప్రీమియర్​ లీగ్​ షెడ్యూల్​

శ్రీలంక ప్రీమియర్​ లీగ్​.. ఈ ఏడాది నవంబరు 14 నుంచి డిసెంబరు 6 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. మొత్తం ఐదు జట్లు.. 23 మ్యాచులను ఆడనున్నాయి.

2020 Lanka Premier League to begin on November 14
లంక ప్రీమియర్‌ లీగ్‌

By

Published : Sep 3, 2020, 4:02 PM IST

శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌(ఎస్‌ఎల్‌పీఎల్‌) షెడ్యూల్​ను ప్రకటించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. లీగ్​ను ఈ ఏడాది నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ లీగ్‌ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ టోర్నీని మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. 15 రోజుల వ్యవధిలో మొత్తం ఐదు జట్లు 23 మ్యాచ్​ల్లో తలపడనున్నాయి.

ఇది చూడండి ఐపీఎల్​లో నలుగురు ఎలీట్ ప్యానెల్​ అంపైర్లు!

ABOUT THE AUTHOR

...view details