తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: అత్యధిక పరుగుల వీరులు వీరే - 2019 World Cup: Top five run-scorers in WC history

మే 30న ప్రపంచకప్​ ప్రారంభంకానుంది. మెగాటోర్నీకి ముందు వరల్డ్​కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన మొదటి ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

సచిన్

By

Published : May 15, 2019, 5:52 PM IST

క్రికెట్ ప్రియులను అలరించడానికి మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్​ మొదలవబోతోంది. మొత్తం 10 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీ మే 30న ప్రారంభంకానుంది. ఇప్పటివరకు ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో ఎక్కువ పరుగులు సాధించిన మొదటి ఐదురుగు ఆటగాళ్లను ఓసారి చూద్దాం.

5. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)

  1. మూడు ప్రపంచకప్​లలో పాల్గొన్న ఈ సఫారీ ఆటగాడు మంచి ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 22 ఇన్నింగ్స్​లలో 63.53 సగటుతో 1,207 పరుగులు సాధించాడు. స్ట్రైయిక్ రేట్ 117.30 గా ఉంది. రెండుసార్లు జట్టును సెమీస్ (2007, 2015) చేర్చడంలో కీలకపాత్ర వహించాడు. అభిమానులు మిస్టర్ 360గా పిలుచుకునే డివిలియర్స్ మూడు ప్రపంచకప్​ల్లో నాలుగు శతకాలు బాదాడు. అభిమానులకు చేదువార్త ఏంటంటే ఏబీడీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం. అన్ని ఫార్మాట్లకు దూరమైన డివిలియర్స్ ఈ ప్రపంచకప్​లో ఆడడం లేదు.
    డివిలియర్స్

4. బ్రియన్ లారా ( వెస్టిండీస్)

  1. వెస్టిండీస్ క్రికెట్ సంచలనం లారా 2003, 2007 ప్రపంచకప్​ల్లో విండీస్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. మొత్తం 33 ఇన్నింగ్స్​ల్లో 1,225 పరుగులు సాధించాడు. ఓ దశలో కరీబియన్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడీ ఆటగాడు. మెగాటోర్నీలో రెండు శతకాలతో పాటు ఏడు అర్ధశతకాలు సాధించాడు. అత్యధిక స్కోర్ 116 పరుగులు.
    లారా

3. కుమార సంగక్కర (శ్రీలంక)

  1. ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ అయిన సంగక్కర జెంటిల్మన్ క్రికెటర్​గా పేరు సంపాదించాడు. 2015 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆ వరల్డ్​కప్​లో వరుసగా నాలుగు శతకాలు సాధించి ఔరా అనిపించాడు. మొత్తం 35 ప్రపంచకప్ ఇన్నింగ్స్​ల్లో 56.74 సగటుతో 1,535 పరుగులు సాధించాడు. స్ట్రైయిక్ రేట్ 86.55గా ఉంది. 2015 మెగాటోర్నీకి ముందు ప్రపంచకప్​లో కేవలం ఒకే శతకం చేసిన సంగక్కర.. 2015 వరల్డ్​కప్​లో ఏకంగా నాలుగు శతకాలు బాది ప్రతిష్టాత్మక టోర్నీలో అత్యధిక శతకాలు చేసిన రెండో ఆటగాడిగా పాంటింగ్ సరసన నిలిచాడు.
    సంగక్కర

2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)

  1. ఆసీస్ జట్టుకు రెండు సార్లు ప్రపంచకప్​ అందించిన సారథి పాంటింగ్. మొత్తం 42 ఇన్నింగ్స్​ల్లో 45.97 సగటుతో 1,743 పరుగులు సాధించి వరల్డ్​కప్​లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. స్ట్రైయిర్ రేట్ 79.95గా ఉంది. అత్యధిక పరుగులు చేసిన మొదటి ఐదుగురు బ్యాట్స్​మెన్ స్ట్రైయిక్​ రేట్లలో ఇదే అత్యల్పం కావడం విశేషం. ఈ మెగాటోర్నీలో మొత్తం 5 శతకాలు సాధించి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో సంగక్కరతో పాటు రెండో స్థానంలో ఉన్నాడు.
    రికీ పాంటింగ్

1. సచిన్ తెందుల్కర్ (భారత్)

  1. ప్రపంచ క్రికెట్​లోనే కాదు ప్రపంచకప్​లోనూ రికార్డుల్లో సచిన్ ముందుంటాడు. ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు మాస్టర్ బ్లాస్టర్. మొత్తం 45 మ్యాచ్​ల్లో 2,278 పరుగులు చేశాడు. వరల్డ్​కప్​లో రెండు వేల పరుగులు దాటిన మొదటి క్రికెటర్​గా ఘనత సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అత్యధిక శతకాలతో పాటు అత్యధిక అర్ధశతకాల రికార్డు సచిన్ పేరిటే ఉంది. మొత్తం 6 సెంచరీలు, 15 అర్ధసెంచరీలతో ముందున్నాడు. సచిన్​ కెరియర్​లో 2003 ప్రపంచకప్ గుర్తుండిపోతుంది. ఆ టోర్నీలో నమీబియాపై సాధించిన 152 పరుగులు ప్రపంచకప్​ సెంచరీల్లో అత్యుత్తమమైంది.
    సచిన్

ఇవీ చూడండి.. WC19 : గెలుపు ముంగిట "మలుపు" కథలు

ABOUT THE AUTHOR

...view details