తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీక్షణలో 2019 ప్రపంచకప్ సరికొత్త రికార్డు​

ఇంగ్లీష్​ గడ్డపై ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్.. ఐసీసీ చరిత్రలోనే అత్యధికులు వీక్షించిన టోర్నీగా రికార్డు సృష్టించింది. గత ప్రపంచకప్​ కంటే ఇది 38 శాతం అధికం.

By

Published : Sep 16, 2019, 5:32 PM IST

Updated : Sep 30, 2019, 8:37 PM IST

వీక్షణలో 2019 ప్రపంచకప్ సరికొత్త రికార్డు​

ఎంతో ఉత్సాహంగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్​ ప్రేక్షకుల్ని తనదైన శైలిలో అలరించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చరిత్రలో అత్యధికులు వీక్షించిన టోర్నీగా రికార్డు సృష్టించింది​. వివిధ మాధ్యమాల్లో 160 కోట్ల మంది ఈ మ్యాచ్​లను చూశారు. గత ప్రపంచకప్​ కంటే ఇది 38 శాతం అధికం.

సెల్​ఫోన్​లో మ్యాచ్​ వీక్షిస్తున్న నెటిజన్(పాత చిత్రం)

"ప్రపంచకప్​ జరిగే సమయంలో డిజిటల్ ఫ్లాట్​ఫామ్స్​లో టీమిండియా మ్యాచ్​లు ఎక్కువగా ఆదరణ పొందాయి. భారత్-న్యూజిలాండ్​ సెమీఫైనల్ మ్యాచ్​ను అత్యధికంగా 25.3 మిలియన్ల మంది హాట్​స్టార్​లో వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్​కాస్ట్​లో 706 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారాలు చూశారు. భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​ను ప్రపంచం మొత్తంగా సుమారు 273 మిలియన్ల మంది టీవీల్లో చుశారు. మరో 50 మిలియన్ల మంది డిజిటల్ మాధ్యమాల్లో వీక్షించారు." -అంతర్జాతీయ క్రికెట్ మండలి

సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న ఇంగ్లాండ్​.. ఉత్కంఠగా సాగిన ఫైనల్​లో కివీస్​ను ఓడించి తొలిసారి కప్పును ముద్దాడింది. తర్వాతి స్థానాల్లో టీమిండియా, ఆస్ట్రేలియా నిలిచాయి. 2023 ప్రపంచకప్ భారత్​ వేదికగా జరగనుంది.

ఇది చదవండి: ప్రపంచకప్​లో అత్యధికులు వీక్షించిన వీడియో ఇదే..!

Last Updated : Sep 30, 2019, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details