తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​పై ఓటమి​..  దృష్టి సారించాల్సిన అంశాలు - కివీస్​తో ప్రాక్టీస్ మ్యచ్​.. దృష్టిసారించాల్సిన అంశాలు

ప్రపంచకప్ వార్మప్​లో భాగంగా కివీస్​తో జరిగిన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్​లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​ పరాజయం తర్వాత భారత్ దృష్టిసారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

మ్యాచ్

By

Published : May 26, 2019, 11:17 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో భారత్ ఘోరపరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 39.2 ఓవర్లలో 179 పరుగులే చేసింది. బ్యాట్స్​మెన్​లో జడేజా మినహా ఎవరూ రాణించలేదు. హార్దిక్ పాండ్య ఫర్వాలేదనిపించాడు.

ఈ మ్యాచ్​లో ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చింది టీమిండియా. హార్దిక్ పాండ్యను ఐదో స్థానంలో బ్యాటింగ్​కు పంపింది. మొదటి నాలుగు ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్న బుమ్రాకు ఆ తర్వాత బంతిని ఇవ్వలేదు. ఇవి కొంత వరకు సత్ఫలితాలనిచ్చినా మ్యాచ్​ చేజారడం నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్​ ద్వారా టీమిండియా దృష్టిసారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

టీమిండియా జట్టు

లెఫ్టార్మ్ పేసర్​తో ఇబ్బందులు

2017 నుంచి లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్​లో రోహిత్ సగటు 20కి దిగువగానే ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్​లోనూ బౌల్ట్​ బౌలింగ్​లో వికెట్ల ముందు దొరికిపోయాడు. బౌల్ట్​ బౌలింగ్​లోనే కీపర్​కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ధావన్. కార్డిఫ్​లో బంగ్లాదేశ్​తో జరిగే తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్​లోనైనా ఈ విషయంపై టీమిండియా దృష్టిపెట్టాలి. బంగ్లా లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్​ను కోహ్లి సేన ఎలా ఎదుర్కొంటుందో అనేది ఆసక్తికరం. భారత ప్రపంచకప్​ జట్టులో లెఫ్టార్మ్ పేసర్​కు చోటు దక్కలేదు. ఖలీల్ అహ్మద్ రూపంలో నెట్ బౌలర్​ ఉన్నాడు. నెట్స్​లో అతడి బౌలింగ్​లో భారత బ్యాట్స్​మెన్​ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

నాలుగో స్థానం

టీమిండియాకు తలనొప్పిగా మారిన సమస్య నాలుగో స్థానంలో బ్యాటింగ్. ఆల్​రౌండర్ విజయ్ శంకర్​ గాయంతో మొదటి ప్రాక్టీస్​ మ్యాచ్​కు దూరమవగా... రాహుల్ ఈ స్థానంలో బ్యాటింగ్​కు దిగి విఫలమయ్యాడు. జూన్ 5న జరగబోయే మొదటి మ్యాచ్​కు ముందు ఈ సమస్యను అధిగమించాలని చూస్తోంది జట్టు.

టీ20 స్పెషలిస్టులు

ఐపీఎల్​లో అదరగొట్టి ప్రపంచకప్​ జట్టులో స్థానం సంపాదించిన రాహుల్, కార్తీక్... కివీస్​తో జరిగిన మ్యాచ్​లో విఫలమయ్యారు. బంగ్లాదేశ్​లో జరిగే మ్యాచ్​లో అయినా వారు ఫామ్​లోకి రావాల్సి ఉంది.

జడేజా లేక కుల్దీప్

మొదటి ప్రాక్టీస్ మ్యాచ్​లో అర్ధశతకంతో రాణించిన జడేజాకు రానున్న మ్యాచ్​లో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఆకట్టుకున్నాడు జడేజా. 71 పరుగులతో రాణించిన టేలర్ వికెట్​ తీశాడు. ఐపీఎల్​లో విఫలమైన కుల్దీప్.. కివీస్​పై అంత ప్రభావం చూపించలేకపోయాడు. 8.1 ఓవర్లలో వికెట్ ఏమీ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు.

జడేజా, కుల్దీప్

ఇవీ చూడండి.. 'మోసగాడా వెళ్లిపో'- వార్నర్, స్మిత్​కు చేదు అనుభవం

ABOUT THE AUTHOR

...view details