గతేదాడి తనపై విధించిన నిషేధం వల్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. దాని ఫలితంగా ఆటలో నిలకడైన ఆటగాడిగా మారానని అన్నాడు. ఈ సస్పెన్షన్‌తో క్రికెట్‌కు తాను ఎంత దూరమయ్యానో తెలిసొచ్చిందని పేర్కొన్నాడు రాహుల్. అందువల్ల తన జీవితం నిరుపయోగంగా మారిందని తెలిపాడు. అందుకే అప్పటినుంచి తన శక్తి సామర్థ్యాలను సరైన రీతిలో ఉపయోగించాలని అనుకున్నట్లు తెలిపాడు. ఇతర విషయాలపై కాకుండా కేవలం ఆటపైనే పూర్తి దృష్టి సారించినట్లు వెల్లడించాడు.
దీనితో పాటు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు రాహుల్. అనేక సందర్భాల్లో హిట్‌మ్యాన్ తనకు అండగా నిలిచాడని చెప్పుకొచ్చాడు. అలాగే అతడి బ్యాటింగ్‌కు తాను వీరాభిమానిని, రోహిత్ లాంటి స్టార్ ఆటగాడు జట్టులో ఉంటే యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ కలుగుతుందని అన్నాడు.