అడిలైడ్ వేదికగా 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ట్విట్టర్ వేదికగా అప్పటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ.. ఆ మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు.
"మన ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన, ముఖ్యమైన ఓ టెస్టు సిరీస్ను గుర్తు చేసుకుందాం. 2014లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు ఇరు జట్లకు ఎంతో భావోద్వోగభరితమైంది. ప్రేక్షకులకు కూడా మరపురాని అనుభూతులనిచ్చింది. ఆ సిరీస్ మాకు ఎంతో నేర్పించింది. మన మనస్సు ఏదైనా సాధించాలనుకుంటే అది సాధ్యమవుతుంది. మొదట ప్రారంభించడానికి కష్టంగా అనిపించినప్పటికీ.. చివరకు పూర్తి చేస్తాం. మనందరం వాటికి కట్టుబటి ఉన్నాం. టెస్టు సిరీస్ పరంగా ఈ టోర్నీ మాకు ఎల్లప్పుడూ ఒక మైలురాయిగా నిలుస్తుంది."