తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేడే బీసీసీఐ సమావేశం.. పలు అంశాలపై చర్చ - BCCI AGM

ఐపీఎల్​లో కొత్తగా రెండు జట్లను చేర్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ కొత్త జట్లతో పాటు పన్ను రాయితీ, క్రికెట్ కమిటీల ఏర్పాటు ప్రధాన అజెండాగా నేడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది.

2 new IPL teams on Thursday's BCCI AGM agenda
నేడే బీసీసీఐ ఏజీఎం.. పలు అంశాలపై చర్చ

By

Published : Dec 24, 2020, 7:31 AM IST

ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లను చేర్చేందుకు రంగం సిద్ధమైంది. గురువారం వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కొత్త జట్ల ప్రతిపాదన చర్చకు రానుంది. కొత్త జట్లు, పన్ను రాయితీ, క్రికెట్‌ కమిటీల ఏర్పాటు ప్రధాన అజెండాగా ఈ ఏజీఎం జరగనుంది. కొత్త జట్లు 2022 ఐపీఎల్‌లో అరంగేట్రం చేయొచ్చని, అప్పుడు 94 మ్యాచ్‌లతో లీగ్‌ నిర్వహించే అవకాశముందని బీసీసీఐ అధికారి చెప్పారు.

గంగూలీ జట్టు ఓటమి

ఏజీఎంకు ముందు సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో సరదాగా నిర్వహించిన మ్యాచ్‌లో గంగూలీ నేతృత్వంలోని ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ 28 పరుగుల తేడాతో జై షా నాయకత్వంలోని సెక్రటరీ ఎలెవన్‌ చేతిలో ఓడిపోయింది. సెక్రటరీ ఎలెవన్‌ తరఫున అజహరుద్దీన్‌ 22 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. గంగూలీ (58 నాటౌట్‌) ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ను గెలిపించేందుకు పోరాడినా ఫలితం లేకపోయింది.

ABOUT THE AUTHOR

...view details