టీమిండియామహిళా జట్టులో ఓ యువ కెరటం చోటు దక్కించుకుంది. టీ20లకు వీడ్కోలు చెప్పిన సీనియర్ బ్యాట్స్ఉమెన్ మిథాలీరాజ్ స్థానంలో 15 ఏళ్ల షెఫాలీ వర్మ ఆడనుంది. మహిళల టీ20 ప్రీమియర్ లీగ్ ఛాలెంజ్‌లో మిథాలీ సారథ్యంలోనే ఆడిన ఈ యువ క్రికెటర్... దూకుడైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. దేశవాళీ టోర్నీల్లోనూ సత్తా చాటి, త్వరలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేయనుంది. గురువారం ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. ఇందులో షెఫాలీకి అవకాశం లభించింది.
దేశవాళీ క్రికెట్, అండర్-23లో 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసింది షెఫాలీ. అండర్-19 టోర్నీలోనూ విధ్వంసకర ఆటతో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసింది. అలాగే ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేయగలదు.
రెండో పిన్నవయస్కురాలు..