భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త ఫీట్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ఉమెన్గా రికార్డు సృష్టించింది. ఈమెకంటే ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ ఈ ఘనత సాధించింది.
మిథాలీ రాజ్ సాధించిన ఘనతకు గానూ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 'వాట్ ఏ ఛాంపియన్! పది వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాట్స్ఉమెన్ మిథాలీ' అంటూ ట్వీట్ చేసింది.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భాగంగా మిథాలీ ఈ మైలురాయిని అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ అన్నె బోస్క్ వేసిన 28వ ఓవర్లో బౌండరీ సాధించిన ఈ వెటరన్ బ్యాట్స్ఉమెన్.. ఈ అరుదైన రికార్డును సాధించింది. ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో 36 పరుగులు చేసిన మిథాలీ.. రికార్డు సాధించిన తర్వాతి బంతికే పెవిలియన్ చేరింది.
భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లాడిన మిథాలీ.. 663 పరుగులు సాధించింది. 212 వన్డేలతో పాటు 89 టీ20ల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుసగా 6938, 2364 రన్స్‌తో ఉంది.
ఇదీ చదవండి:మార్చి 16న ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫయర్ ట్రయల్స్