ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌లో కరోనా కలకలం సృష్టించింది. టీమ్ఇండియాకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ బౌలర్‌తో పాటు 10-12 మంది సహాయ సిబ్బందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మరో వారం రోజుల పాటు జట్టు సభ్యులందరూ క్వారంటైన్లో ఉండనున్నారు. వీళ్లతోపాటే సీఎస్కే మేనేజ్మెంట్ సీనియర్ అధికారి, ఆయన భార్య, సోషల్ మీడియా బృందంలోని ఇద్దరికి కరోనా సోకినట్లు ఐపీఎల్ అధికారి తెలిపారు. వారం తర్వాత చెన్నై జట్టులోని అందరికీ మరోసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగటివ్‌గా తేలిన తర్వాతే బయో బబుల్‌లోకి అనుమతిస్తారు.
చెన్నై జట్టులోని భారత యువ బౌలర్‌కు కరోనా
చెన్నై జట్టులోని 10 మందికి పైగా కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో సభ్యులందరినీ క్వారంటైన్‌కు పంపించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు.
చెన్నై సూపర్‌కింగ్స్
కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌ను దుబాయ్‌లో జరపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 19 నుంచి జరిగే లీగ్ కోసం దాదాపు నెల ముందుగానే క్రికెటర్లందరూ అక్కడికి చేరుకున్నారు. వీరికి ఆరు రోజులు క్వారంటైన్లో ఉంచి మూడుసార్లు వైద్యపరీక్షలు జరిపారు. ఇందులో నెగటివ్ వచ్చిన ఆటగాళ్లు శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. వైరస్ ఉన్నట్లు తేలితో బోర్డు నిబంధనల ప్రకారం మరో వారం రోజులు నిర్బంధంలో ఉండాలి.
Last Updated : Aug 28, 2020, 5:33 PM IST