భారత్‌లాగే పాకిస్థాన్‌లోనూ క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లను అందించిన ఈ దేశం 2009లో ఉగ్రదాడుల తర్వాత క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే వీల్లేకుండా పోయింది. ఇటీవలే మళ్లీ పాక్‌లో ఆడేందుకు కొన్ని జట్లు ముందుకొస్తున్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు కూడా మరికొద్ది నెలల్లో అక్కడ పర్యటించనున్నాయి. అయితే కరోనా ఆ దేశ క్రికెట్ మైదానాలను నాశనం చేసిందనే చెప్పాలి. అందుకు నిదర్శనం ఈ స్టేడియం.
స్టేడియంలో వ్యవసాయం..
ఓవైపు పాకిస్థాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా జరగట్లేదు, మరోవైపు కరోనా. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం లాహోర్, కరాచీల్లోనే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ముల్తాన్, ఫైసలాబాద్‌లో ఆడేందుకు వీలున్నా అది కుదరట్లేదు. దీంతో కనీసం దేశవాళీ మ్యాచ్‌లైనా నిర్వహించే వీలులేకపోవడం వల్ల పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ స్టేడియంలో కూరగాయలు పండిస్తున్నారు.
లక్షలు ఖర్చు చేసి..
దేశంలో క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, క్రికెటర్ల సౌకర్యార్థం లక్షల రూపాయలు వెచ్చించి ఖనేవాల్ స్టేడియాన్ని నిర్మించారు. మంచి ప్రాక్టీస్ ఏరియా, పెవిలియన్‌తో పాటు ఇందులో అత్యాధునికి సౌకర్యాలు ఉన్నాయి. కానీ కొంతకాలంగా ఇందులో పంటలు పండిస్తున్నారు. కనీసం దేశవాళీ మ్యాచ్‌లకైనా అవకాశం లేకుండా స్డేడియంలో మిరపకాయ, గుమ్మడి వంటి పంటలు వేస్తున్నారు.
మళ్లీ గాడిన పడుతుందా?
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌కు అతిథ్యం ఇవ్వనుంది పాక్. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతోనూ సిరీస్ ఆడనుంది. దీంతో పాక్ క్రికెట్‌కు పూర్వవైభవం వస్తుందని పీసీబీ భావిస్తోంది. ఈ సిరీస్‌లు సజావుగా జరిగితే రెగ్యులర్‌గా పాక్ గడ్డపై సిరీస్‌లు జరిగే వీలుంటుందని ఆశిస్తున్నారు. ఇదే జరిగితే ఇక్కడి స్టేడియాలకు పునఃవైభవం రావడం ఖాయంగా కనిపిస్తోంది.