యూఏఈ క్రికెటర్లు ఆమిర్ హయత్, అష్ఫాక్ అహ్మద్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2019 టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌ల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.
ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై ఐసీసీ నిషేధం - అష్ఫక్ అహ్మద్
అవినీతికి పాల్పడిన ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై నిషేధం విధించింది ఐసీసీ. 2019 టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని అవినీతి నిరోధక విభాగం తేల్చి చెప్పింది.
![ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై ఐసీసీ నిషేధం icc ban, amir hayat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12330513-thumbnail-3x2-dds.jpg)
ఐసీసీ బ్యాన్, అమీర్ హయత్
భారత్‌కు చెందిన మిస్టర్ 'వై' అనే బుకీ నుంచి డబ్బులు చేతులు మారినట్లు ఐసీసీ నిర్ధరించింది. వీరిద్దరూ రూ.3 లక్షలు తీసుకున్నట్లు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో వాట్సాప్ మేసేజ్‌లు కూడా నడిచినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో అష్ఫాక్ అహ్మద్ బ్యాట్స్‌మన్ కాగా, ఆమిర్ హయత్ బౌలర్.
ఇదీ చదవండి:'ఎలా నవ్వగలుగుతున్నావు బుమ్రా.. బాధగా లేదా'?