Cricket In Olympics 2028 :క్రికెట్‌ను క్రేజ్ మరో రేంజ్‌కు తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా 2028 లాస్‌ఏంజెలస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేర్చనున్నారు. దీంతో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ను చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
IOC Meeting In Mumbai :ఈ నెల 15 నుంచి 17 వరకు ముంబయిలో ఆరంభమయ్యే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ- ఐఓసీ సమావేశంలోఒలింపిక్స్లో క్రికెట్‌ను చేర్చే విషయాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయమై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ.. లాస్ఏంజెలెస్ ఒలింపిక్ నిర్వాహక కమిటీతో కొంత కాలంగా సంప్రదింపులు జరుపుతోంది. తాజాగా 2028 ఒలింపిక్స్‌లో పలు క్రీడలతో పాటు క్రికెట్‌ను కూడా చేర్చాలని సిఫార్సు ఆ కమిటీ చేసింది.
ఈ విషయంపై ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే స్పందించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ఎల్ఏ28 సిఫార్సు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే ఇది తుది నిర్ణయం కానప్పటికీ.. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడడంలో ఇదో మైలురాయి అని అన్నారు. 'ఒలింపిక్స్‌లో కొత్త ఆటలు చేర్చే విషయంలో గత రెండు సంవత్సరాలుగా ఎల్ఏ28 చాలా సపోర్ట్ చేస్తోంది. అందుకు ఎల్ఏ28కి కృతజ్ఞతలు. ముంబయిలో జరగనున్న ఐఓసీ సమావేశంలో తీసుకునే తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం' అని బార్క్లే తెలపారు.